Bangladesh: బంగ్లాదేశ్ లో యూనస్, ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలు
ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటు కోసం సైన్యం అత్యవసర సమావేశం;
బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్, సైన్యాధక్షుడు వకర్-ఉజ్-జమాన్ మధ్య దూరం పెరిగిందా? అవుననే జవాబిస్తున్నాయి సైనిక వర్గాలు. ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కార్యాచరణను కనుగొనేందుకు బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో సాధ్యమైనంత త్వరలో ఎన్నికలను యూనస్ ప్రకటించాలని జమాన్ కోరుకుంటున్నారు. విదేశీ జోక్యం కారణంగా దేశంలో అస్థిరత పెరిగిపోతుందని ఆయన ఆందోళన చెతుతున్నారని, విదేశీ శక్తుల చేతిలో యూనుస్ కీలుబొమ్మగా మారిపోయారని కూడా ఆయన భావిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి.