శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కత్తులతో యువకుల వీరంగం కలకలం సృష్టించింది. రద్దీ ప్రాంతంలో సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే మద్యం మత్తులో యువకులు హల్‌చల్ చేశారు. కత్తులు పట్టుకుని రోడ్డుపై తిరుగుతుంటే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్తచెరువు ప్రభుత్వాస్పత్రిలో మద్యం మత్తులో యువకుడు హంగామా సృష్టించిన ఘటన జరిగి వారం గడవకముందే ప్రధాన సర్కిల్ కత్తులతో వీరంగం వేయడంపై స్థానికుల వణికిపోతున్నారు. వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.