Plane Crash : ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం..

భారీగా ఎగసిపడిన మంటలు;

Update: 2025-08-12 03:30 GMT

అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం అప్పటికే ఆగి ఉన్న ప్రయాణికులు లేని విమానాన్ని ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్‌, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి ఎయిర్‌పోర్టులోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. ఆ విమానాన్ని 2011లో తయారు చేశారని పేర్కొన్నారు.

Tags:    

Similar News