దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్‌లో అరుదైన కేసు నమోదైంది. ఖండ్వా రోడ్‌లోని ఓ దేవాలయం వద్ద బిచ్చగత్తెకు బిచ్చం ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరం కింద నమోదైన మొదటి కేసు ఇదే కావడం విశేషం. నేరస్థునికి ఒక ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేలు వరకు జరిమానా లేదా ఈ రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. దేశంలోనే మొదటి బిచ్చగాళ్ల రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఇండోర్ అధికారులు నిర్ణయించారు. కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 10 నగరాలను భిక్షాటన రహిత నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్టును ఇండోర్‌లో అమలు చేస్తున్నారు. బిచ్చగాళ్ల సమాచారం చెప్పినవారికి రూ.1,000 బహుమతి ఇస్తున్నారు.