భారత రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదో వర్ధంతి కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. స్మారక స్థలం సదైవ్ అటల్ పార్క్ వద్ద వాజ్‌పేయికి రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు నివాళులుర్పించారు. తొలుత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రొటోకాల్ ప్రకారం స్పీకర్, రక్షణశాఖ మంది రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు.