పుతిన్ చాలా భయపడ్డాడు: ఉక్రెయిన్
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో వణికిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్;
రష్యాపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు.. అధ్యక్షుడు పుతిన్ స్వయంకృతాపరాథమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ఛీప్ ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటనతో పుతిన్ చాలా భయపడ్డాడని ఎద్దేవా చేశారు. వాగ్నర్ ముప్పును పుతినే సృష్టించుకున్నాడన్న జెలెన్‌స్కీ... కిరాయి సైన్యం ముందుకు సాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు ఎక్కడో దాక్కున్నాడని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్ స్కీ.. రష్యా అత్యంత బలహీన పడిందని ఆరోపించారు.