ఆషాడమాసం సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని, తొర్రేడు గ్రామ దేవత శ్రీ ఒనువులమ్మ అమ్మవారు శాకంబరీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారి గర్భాలయం సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ కమిటీ సభ్యులు. సుదూరు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.