కండక్టర్లను వేధిస్తున్న మేడ్చల్ డిపో మేనేజర్
టార్గెట్ల పేరుతో ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారంటూ మేడ్చల్ డిపో ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.;
టార్గెట్ల పేరుతో ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారంటూ మేడ్చల్ డిపో ఎదుట బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. డిపో మేనేజర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గత నెలలో మంత్లీ పాస్‌లను తక్కువగా విక్రయించారన్న నెపంతో కొంత మంది కండక్టర్ల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కండక్టర్లను మానసికంగా వేధిస్తున్న డిపో మేనేజర్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.