Sam Pitroda : ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ పిట్రోడా
కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం;
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మళ్లీ శాం పిట్రోడాను నియమిస్తూ బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనే ఛైర్మన్‌గా ఉండేవారు. ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మళ్లీ ఆయననే కాంగ్రెస్ పార్టీ నియమించింది.