CRIME: ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య

Update: 2025-04-27 07:00 GMT

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ కిరాతక కొడుకు దారుణంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో ఈ దారుణం జరిగింది. తన తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్‌ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై కుమారుడితో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అప్పలనాయుడు (55), జయ (45)లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు.

భర్తను చంపిన భార్య

రంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. ధన్నారానికి చెందిన ప్రవీణ్ భార్య ప్రమీల కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.


Tags:    

Similar News