కాల్పులతో దక్షిణాఫ్రికా దద్దరిల్లింది. హాస్టల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. 11 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రిటోరియాలోని సాల్స్‌విల్లేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.కాగా, ఈ సంఘటనలో 11 మంది మరణించారు. 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది మృతుల్లో మూడు, 12 ఏళ్ల వయస్సున్న బాలురు, 16 ఏళ్ల యువతి ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించే ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన జరిగినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.