అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏకగ్రీవ ఎన్నికకు విపక్షాలు సహకరించాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించిన దివంగత నేత సాయన్నపై గౌరవం ఉంటే..ఆయన కూతురు లాస్య నందితకు పార్టీలన్నీ మద్దతు తెలపాలన్నారు. కంటోన్మెంట్‌లోని లాస్యనందిత నివాసంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి తలసాని హాజరయ్యారు. ఎన్నికలు వస్తే లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. సమావేశం తర్వాత బోయిన్‌పల్లిలో యాదవ భవనాన్ని ప్రారంభించారు.