సీఎం జగన్ పాలనపై టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముస్లిం పథకాలను ఆపేసిన జగన్ పరిపాలనకు అనర్హుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారం లోకి వస్తే.. రంజాన్ తోఫా, దుల్హన్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి మహిళలు, చిరువ్యాపారులను ఆదుకోవడమే టీడీపీ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరూలో పర్యటించిన నల్లారి.. టీడీపీ మ్యానిఫెస్టోను ఇంటింటికీ తిరుగుతూ వివరించారు.