ఢిల్లీ నుంచి వస్తుండగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో.. అయ్యన్నపాత్రుడును కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గన్నవరం యువగళం సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రుల్ని అయ్యన్న విమర్శించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయ్యన్న పాత్రుడు అరెస్టుపై నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. అరెస్టులతో జగన్ తమ గొంతులు నొక్కలేరన్నారు.