ఆగస్ట్‌ 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Update: 2023-07-28 11:49 GMT

ఆగస్ట్‌ 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాల సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించనున్నారు. సోమవారం కేబినెట్‌ భేటీ జరగనుంది. వర్షాలు, వరదలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రధానంగా ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం కానునున్నాయి. పలు బిల్లుల ఆమోదంతోపాటు విధానపరమైన నిర్ణయాలను శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఆగస్ట్‌ 3న బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. 

Tags:    

Similar News