Cabinet Meeting : అసెంబ్లీ కమిటీహాల్‌లో మంత్రివర్గం భేటీ..
బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్;
బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం అయ్యింది. అసెంబ్లీ కమిటీ హాల్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పద్దుకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపుల గురించి సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారాసకు ధీటుగా సమాధానం చెప్పడం, నల్గొండలో ఆ పార్టీ సభ తలపెట్టిన నేపథ్యంలో అధికార పక్షంగా ఎదుర్కోవడం, తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ ఆనకట్టపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.