తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నారు. గత నెల 31న అక్కడికి వెళ్లిన వారు వర్షాలకు రహదారులు తెగిపోవడంతో తిరిగి రాలేకపోయారు. ఏపీకి చెందిన అడప సత్యనారాయణ్... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా మంత్రి స్పందించారు. యాత్రికులను తరలించడానికి చర్యలు చేపట్టాలని రుద్రప్రయాగ్ కలెక్టర్‌కు సూచించారు. శనివారం హెలికాప్టర్ ద్వారా 12 మంది యాత్రికులను ఉత్తర కాశీకి తరలించారని, తెలంగాణకు చెందిన ముగ్గురు యాత్రికులు అక్కడే ఉన్నారని సత్యనారాయణ్ తెలిపారు.
గుండెలను మెలిపెడుతున్న చిన్నారి లేఖ
ప్రకృతి విలయంతో అల్లకల్లోలమైన వయనాడ్‌లో ఇండియన్ ఆర్మీ సహాయ చర్యలు చేపట్టింది. ఆర్మీ ధైర్యసాహసాలను చూసి చలించిపోయిన మూడో తరగతి విద్యార్థి రాసిన లేఖ అందరి హృదయాలను కదిలిస్తోంది. "డియర్ ఇండియన్ ఆర్మీ వయనాడ్‌లో మీరు చేస్తున్న సాహసాలను చూసి చలించిపోయాను. ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది" అని మలయాళంలో విద్యార్థి రేయాన్ లేఖ రాశాడు.