Hyderabad: ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత
అజరుద్దీన్‌ను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు భవానీశంకర్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట;
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్‌లో మాజీ క్రికెటర్ అజరుద్దీన్ చిచ్చు కాక రేపుతోంది. బుధవారం చేపట్టిన ఛాయ్ విత్ అజర్ భాయ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు దాదాపు రెండు గంటల పాటు అజరద్దీన్‌ను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేత భవానీశంకర్, విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలపై లాఠీఛార్జ్ చేసేదాక వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చివరికి కార్యక్రమంలో పాల్గొనకుండానే అజరుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ మీద విష్ణువర్ధన్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. దీంతో అజరుద్దీన్ తీరుపై విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా జూబ్లీహిల్స్‌లో అజరుద్దీన్ ఎలా పర్యటిస్తారని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై అజరుద్దీన్ కన్ను వేస్తే ఖబర్దార్ అంటూ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు హెచ్చరించారు.