హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి ఇంట్లో చోరీ జరిగింది. రిటైర్డ్ కమిషనర్ శామ్యూల్‌కు మత్తు మందిచ్చి చోరీ చేశారు. భూమి కొనుగోలు చేస్తామంటూ పరిచయమైన నిందితుడు సురేందర్.. గత నెల 30న శామ్యూల్‌కు ఇడ్లీలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆయన సృహ తప్పిన తరువాత భూమి పత్రాలు, రూ. 5లక్షల నగదు, ఐదు తులాల బంగారం, కేజీ వెండితో ఉడాయించాడు. శామ్యూల్ ఫిర్యాదు మేరకు నిందితుడు సురేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వెనుక దుండిగల్ ఎస్‌ఐ కృష్ణ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.