Knife Attack: సూపర్‌మార్కెట్‌లో కత్తితో దాడి.. ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు
షాంగై సూపర్‌మార్కెట్‌లో కత్తితో దాడి జరిగిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. అనుమానితుడిని లిన్ మౌమౌగా గుర్తించారు. 37 ఏళ్ల ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 మందిని ఆస్పత్రికి తరలించారు. దాంట్లో ముగ్గురు మృతిచెందినట్లు తేలింది. 15 మంది ప్రాణాలు మాత్రం ప్రమాదంలో లేవన్నారు. వ్యక్తిగత ఆర్థిక సమస్యల వల్ల లిన్ .. సూపర్‌మార్కెట్‌లో కత్తితో దాడికి పాల్పడినట్లు తేలింది. సూపర్‌మార్కెట్‌లో ఓ వ్యక్తి తన చేతుల్లో కత్తితో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆ సమయంలో అక్కడున్న వారు భయంతో అరుస్తూ పరుగులు తీశారు.