టీపీసీసీ ఉపాధ్యాక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ తన భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తెల్లవారుఝామున ల్యాండ్‌లోకి ప్రవేశించిన పోలీసులు కంటైనర్‌ను తొలగించడమే కాకుండా ప్రహరీ గోడను కూల్చివేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్న తమను పోలీసులు బలవంతంగా బయటకి పంపారన్నారు. కోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్‌లో ఉన్న తన మూడు ఎకరాల భూమికి పాస్‌బుక్‌తో పాటు రైతుబంధు కూడా వస్తుందని తోటకూరి వజ్రేష్ యాదవ్ వెల్లడించారు.