విశాఖ జిల్లా తర్లువాడ భూబాగోతాన్ని టీవీ5 వెలుగులోకి తెచ్చింది.వరస కథనాలతో వాస్తవాలను బయట పెట్టింది.టీవీ5 కథనాలతో ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు చెలరేగాయి. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి భూ కేటాయింపు ప్రతిపాదనలపై స్థానికులు ప్రజాసంఘాలు,ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.ఈ వ్యవహారం పై ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నేపధ్యంలో తర్లవాడ కొండపై టీడీపీ నేతల ఆందోళన చేపట్టారు.తర్లువాడ భూములు కాపాడాలంటూ నినాదాలు చేశారు భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.