ఇరాన్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇరాన్ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య గురువారం పెద్దఎత్తున కాల్పులు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది భద్రతా దళాల సభ్యులు, 18 మంది మిలిటెంట్లు మృతి చెందారు. సిస్తాన్, బలూచిస్థాన్, రస్కా, సర్బజ్, చాబహర్‌లో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. పౌరులను బందీలుగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి పౌరులను కాపాడారు. కాల్పులకు పాల్పడింది జైష్ అల్ అదిల్ ఉగ్ర ముఠా అని సమాచారం.