Kishan Reddy Arrest: బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై కేంద్ర మంత్రి ఫైర్‌

Update: 2023-07-20 09:28 GMT

బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ రోజు యుద్ధం మొదలైందని,యుద్ధాన్ని వాళ్లే మొదలు పెట్టారని అన్నారు. యుద్ధానికి మేం సిద్ధమేనని అన్నారు. తెలంగాణ ప్రజల అండదండలతో బీఆర్ఎస్‌తో యుద్ధం చేస్తామన్నారు. చేతగాని, అసమర్థ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్న కిషన్‌రెడ్డి పోరాటాలతోనే మా రాజకీయ ప్రస్థానం మొదలైందని అన్నారు. తాను ఢిల్లీ నుంచి వస్తే ఎయిర్‌పోర్ట్ వద్దే అడ్డుకుంటారని, నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ప్రశ్నించారు. ప్రజల బాగోగులు చూడానికి వెళ్లాలనుకుంటే అరెస్ట్‌ చేస్తారా అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

Tags:    

Similar News