USA: అమెరికాను వణికిస్తున్న ఫ్లూ

43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు;

Update: 2025-02-09 01:30 GMT

అమెరికాలో ప్రస్తుత ‘ఫ్లూ సీజన్‌’  నడుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో(వింటర్‌ వైరస్‌ సీజన్, ఫ్లూ సీజన్‌) రికార్డు స్థాయిలో ఫ్లూ రుగ్మతలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు శుక్రవారం ఇక్కడి ఆసుపత్రి సమాచార వర్గాలతో పాటు సీడీసీ(సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌) అంచనాలు వెల్లడించాయి.

మొత్తం 43 రాష్ట్రాల్లో గరిష్ఠ సంఖ్యలో బాధితులు ఉన్నారని, ఎక్కువమంది శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర ఫ్లూ రుగ్మతల బారిన పడుతున్నారని, సాధారణంగా శీతాకాలంలో నమోదయ్యే గరిష్ఠ స్థాయిని మించి ప్రస్తుతం కేసుల సంఖ్య ఉన్నట్లు పేర్కొన్నాయి. సీడీసీ గణాంకాల ప్రకారం ఈ సీజన్‌లో సుమారు 2.4 కోట్లమంది ఫ్లూ వైరస్‌ల బారిన పడగా, 3.1 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు. 13 వేల మరణాలు సంభవించాయి. మృతుల్లో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో కోవిడ్‌-19 ఉన్న చిన్నారులు సైతం అధిక సంఖ్యలో ఉన్నట్లు ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆరు నెలలు అంతకంటే ఎక్కువ వయసున్న ప్రతి ఒక్కరూ వార్షిక ఫ్లూ టీకాను పొందాలని, సీజనల్‌ వైరస్‌లను నివారించడానికి సంబంధిత నిబంధనలను తప్పక పాటించాలని అమెరికా ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.  

Tags:    

Similar News