వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తీరుపై గ్రామస్తుల ఆగ్రహం

Update: 2023-08-27 11:17 GMT


పార్వతీపురం మన్యం జిల్లాలో వంతెన నిర్మాణం కోసం గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. పూర్ణపాడు- లాభేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై వంతెన నిర్మించాలంటూ.. అరగుండుతో నిరసన తెలిపారు కోమటిపేట గ్రామస్తులు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ 11 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు.  వంతెన నిర్మాణం విషయంలో కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి తాత్సారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడం వల్ల... అత్యవసర పరిస్థితుల్లో నదిని దాటడానికి నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. 

Tags:    

Similar News