CT2025: దాయాదుల సమరం.. మొదలైన మాటల యుద్ధం

పాకిస్థాన్‌కే అనుకూలమన్న యువరాజ్‌ సింగ్‌... తమపై ఒత్తిడి లేదన్న పాక్ క్రికెటర్‌;

Update: 2025-02-22 02:30 GMT

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్థాన్ దాయాదుల సమరానికి రంగం సిద్దమైంది. క్రికెట్ అభిమానులకు అప్పుడే భారత్-పాక్ ఫీవర్ అంటుకుంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు తమ అంచనాలతో ఈ మ్యాచ్‌పై హైప్ క్రికెట్ చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టులో తగినంత మ్యాచ్ విన్నర్లు లేరని షాహిద్ అఫ్రిది అనగా.. దుబాయ్‌లో ఆడిన అనుభవం కారణంగా పాకిస్థాన్‌కే ప్రయోజనం ఉంటుందని యువరాజ్ సింగ్ అన్నారు. ఈ ఎపిసోడ్ ట్రెండింగ్ అవుతోంది. 'దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో పాకిస్థాన్‌కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని భావిస్తున్నా. ఎందుకంటే భారత్ కంటే వారే అక్కడ ఎక్కువ క్రికెట్ ఆడారు. అక్కడి పరిస్థితులు పాక్ ఆటగాళ్లకు అలవాటే. స్లో వికెట్‌పై బౌలింగ్, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు ఇరు జట్లలో ఉన్నారు.'అని యువరాజ్ సింగ్ తెలిపాడు.


'భార‌త్‌తో మ్యాచ్‌.. స్పెషలేమి కాదు'

భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో పాక్ స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'భారత్‌తో మ్యాచ్ సందర్బంగా మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఆటగాళ్లందరూ రిలాక్స్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకమేమి కాదు. అన్ని క్రికెట్ మ్యాచ్‌లనే ఇది జరుగుతుంది" అని తెలిపాడు.

పాక్‌పై ఆక్మల్‌ ఫైర్‌

తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్‌ ఘోరంగా ఓడిన సంగ‌తి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 60 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టుపై ఆ దేశ మాజీ క్రికెట‌ర్ కమ్రాన్ ఆక్మ‌ల్ విమ‌ర్శ‌ల వర్షం గుప్పించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌లేద‌ని జోస్యం చెప్పాడు. వెళ్లి.. జింబాబ్వేతో ఆడుకోండి అంటూ పాక్ టీమ్‌పై ఫైర్ అయ్యాడు.

ఆ జట్టేమైనా పాకిస్థానా? ఆసీసా? : సెహ్వాగ్‌

బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్య ఛేదనను 46.3 ఓవర్లలో పూర్తి చేసి గెలిచింది. ఈ మ్యాచ్ పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీమిండియా ముందుగానే టార్గెట్‌ను ఛేదిస్తుందని భావించానని, బంగ్లాపై ఏమాత్రం కంగారు పడలేదని వ్యాఖ్యానించాడు.

Tags:    

Similar News