ASES: యాషెస్ సిరీస్‌లో డీఆర్ఎస్ వివాదం

బ్యాట్ తగిలి కీపర్ చేతిలోకి వెళ్లిన బంతి...బ్యాట్‌కు తగిలినట్టు కనిపించిన బంతి.. స్నికోలో స్పైక్స్ రాకపోవడంతో నాటౌట్‌

Update: 2025-12-19 06:00 GMT

యా­షె­స్ సి­రీ­స్ మూడో టె­స్టు­లో తొలి రోజు చోటు చే­సు­కు­న్న వి­వా­దా­స్పద ఘట­న­పై ఎట్ట­కే­ల­కు ఐసీ­సీ స్పం­దిం­చిం­ది. అడి­లై­డ్ వే­ది­క­గా ఇం­గ్లం­డ్‌­తో జరు­గు­తు­న్న మూడో టె­స్టు­లో ఆస్ట్రే­లి­యా వి­కె­ట్‌­కీ­ప­ర్ అలె­క్స్ క్యా­రీ­కి సం­బం­ధిం­చిన డి­సి­ష­న్ రి­వ్యూ సి­స్ట­మ్ (డీ­ఆ­రఎ­స్) వి­ష­యం­లో సాం­కే­తిక లోపం జరి­గిం­ద­ని అం­గీ­క­రిం­చిన ఐసీ­సీ, ఇం­గ్లం­డ్ జట్టు కో­ల్పో­యిన రి­వ్యూ­ను తి­రి­గి ఇచ్చి­న­ట్లు ప్ర­క­టిం­చిం­ది.క్యా­రీ బ్యా­టిం­గ్ చే­స్తు­న్న సమ­యం­లో బంతి బ్యా­ట్‌­ను స్వ­ల్పం­గా తా­కి­న­ట్టు మై­దా­నం­లో స్ప­ష్టం­గా కని­పిం­చి­నా, స్ని­కో మీ­ట­ర్‌­లో స్పై­క్ నమో­దు కా­క­పో­వ­డం­తో ఇం­గ్లం­డ్ వే­సిన రి­వ్యూ వి­ఫ­ల­మైం­ది. అప్ప­టి­కి క్యా­రీ 72 పరు­గు­ల­తో ఉన్నా­డు. ఆ ని­ర్ణ­యం తర్వాత అతడు శతకం పూ­ర్తి చే­య­డం­తో, ఆ ని­ర్ణ­యం ఇం­గ్లం­డ్‌­కు భారీ నష్టం­గా మా­రిం­ది. ఈ ఘట­న­పై ఇం­గ్లం­డ్ క్యాం­ప్ నుం­చి వెం­ట­నే తీ­వ్ర ని­ర­స­న­లు వ్య­క్త­మ­య్యా­యి. సో­ష­ల్ మీ­డి­యా­లో కూడా ఆసీ­స్ మరో­సా­రి చీ­టిం­గ్ చే­సిం­దం­టూ కా­మెం­ట్స్ కూడా ఎక్కు­వ­య్యా­యి.

ఈ నే­ప­థ్యం­లో తొలి రోజు ఆట ము­గి­సిన తర్వాత వి­డు­దల చే­సిన ప్ర­క­ట­న­లో, ప్ర­సార భా­గ­స్వా­మి బీ­బీ­జీ స్పో­ర్ట్‌­తో సం­ప్ర­దిం­పుల అనం­త­రం ఇం­గ్లం­డ్‌­కు రి­వ్యూ­ను తి­రి­గి ఇచ్చి­న­ట్టు ఐసీ­సీ వె­ల్ల­డిం­చిం­ది. స్ని­కో మీ­ట­ర్ ఆడి­యో క్యా­లి­బ్రే­ష­న్‌­లో లోపం ఉం­ద­ని బీ­బీ­జీ స్పో­ర్ట్ కూడా అం­గీ­క­రిం­చిం­ది.క్యా­రీ కూడా మై­దా­నం­లో ఉన్న­ప్పు­డే నిక్ ఉన్న­ట్టు­గా అం­పై­ర్ల­కు సం­కే­తా­లి­చ్చి­న­ట్టు కని­పిం­చా­డు. స్టం­ప్స్ అనం­త­రం మా­ట్లా­డిన అతడు, టె­క్నా­ల­జీ­ని నే­రు­గా వి­మ­ర్శిం­చ­క­పో­యి­నా, ఆ సమ­యం­లో గం­ద­ర­గో­ళం నె­ల­కొం­ద­ని అం­గీ­క­రిం­చా­డు. “బంతి వె­ళ్లే­ట­ప్పు­డు ఏదో తగి­లి­న­ట్టు అని­పిం­చిం­ది. ఆ క్ష­ణం­లో ప్రా­సె­స్‌­ను నమ్మా­ల్సిం­దే. కానీ స్క్రీ­న్ చూ­పిం­చిన దా­ని­కం­టే మై­దా­నం­లో ఉన్న ఆట­గా­ళ్ల­కు వి­ష­యం స్ప­ష్టం­గా అర్థ­మైం­ది” అని క్యా­రీ అన్నా­డు.

ఇం­గ్లం­డ్ బౌ­లిం­గ్ కన్స­ల్టెం­ట్ డే­వి­డ్ సే­క­ర్ మా­త్రం స్ని­కో వి­శ్వ­స­నీ­య­త­పై ఆం­దో­ళన వ్య­క్తం చే­శా­డు. “ఈ సి­రీ­స్ మొ­త్తం స్ని­కో క్యా­లి­బ్రే­ష­న్ సరి­గ్గా లే­ద­న్న భావన ఉంది. ఆ సమ­యం­లో అది చాలా కీలక ని­ర్ణ­యం. ఇలాం­టి తప్పు­లు బా­ధి­స్తా­యి. ఈ రో­జు­ల్లో టె­క్నా­ల­జీ ఇంత బే­సి­క్ వి­ష­యా­ల­ను గు­ర్తిం­చ­లే­క­పో­వ­డం ఆశ్చ­ర్యం­గా ఉంది” అని వ్యా­ఖ్యా­నిం­చా­డు. ఈ ఘట­న­ను ఐసీ­సీ వద్ద అధి­కా­రి­కం­గా లే­వ­నె­త్తా­ల­ని ఇం­గ్లం­డ్ అధి­కా­రు­లు ఆలో­చిం­చి­న­ట్టు సమా­చా­రం. భవి­ష్య­త్తు­లో ఇలాం­టి పరి­స్థి­తు­లు పు­న­రా­వృ­తం కా­కుం­డా, టె­క్నా­ల­జీ ప్రొ­వై­డ­ర్ల­తో కలి­సి వి­ధా­నా­ల­ను మరింత కఠి­నం­గా సమీ­క్షి­స్తా­మ­ని ఐసీ­సీ తె­లి­పిం­ది. రి­వ్యూ­ను తి­రి­గి ఇచ్చి­నా, అప్ప­టి­కే ఇం­గ్లం­డ్‌­కు జర­గా­ల్సిన నష్టం జరి­గిం­ది. యా­షె­స్‌ సి­రీ­స్‌­లో భా­గం­గా ఆస్ట్రే­లి­యా, ఇం­గ్లాం­డ్‌ అడి­లై­డ్ వే­ది­క­గా మూడో టె­స్ట్‌ మ్యా­చ్‌­లో తల­ప­డు­తు­న్నా­యి. 326/8 ఓవ­ర్‌­నై­ట్‌ స్కో­ర్‌­తో రెం­డో రోజు ఆట ప్రా­రం­భిం­చిన ఆస్ట్రే­లి­యా 91.2 ఓవ­ర్ల­లో 371 పరు­గుల భారీ స్కో­ర్‌ చేసి ఆలౌ­టైం­ది. మి­చె­ల్‌­స్టా­ర్క్‌ (54; 75 బం­తు­ల్లో, 9 ఫో­ర్లు) హా­ఫ్‌ సెం­చ­రీ చేసి ఔట­య్యా­డు. మొ­ద­టి­రో­జు అలె­క్స్‌ కేరీ సెం­చ­రీ (106; 143 బం­తు­ల్లో, 8 ఫో­ర్లు, 1 సి­క్స్‌), ఉస్మా­న్‌ ఖవా­జా హా­ఫ్‌ సెం­చ­రీ (82, 126 బం­తు­ల్లో, 10 ఫో­ర్లు) సా­ధిం­చిన వి­ష­యం తె­లి­సిం­దే. ఇం­గ్లాం­డ్‌ బౌ­ల­ర్ల­లో జో­ఫ్రా ఆర్చ­ర్‌ 5, బ్రై­డ­న్‌ కా­ర్స్‌, వి­ల్‌ జా­క్స్‌ తలో రెం­డు వి­కె­ట్లు, జో­ష్‌ టం­గ్‌ 1 వి­కె­ట్‌ తీ­సు­కు­న్నా­రు.  అనం­త­రం బ్యా­టిం­గ్‌ ప్రా­రం­భిం­చిన ఇం­గ్లాం­డ్‌ రెం­డో­రో­జు ఆట ము­గి­సే సమ­యా­ని­కి 68 ఓవ­ర్ల­కు 8 వి­కె­ట్లు నష్ట­పో­యి 213 పరు­గు­లు చే­సిం­ది. బె­న్‌­స్టో­క్స్‌ (45*; 151 బం­తు­ల్లో, 3 ఫో­ర్లు), జో­ఫ్రా ఆర్చ­ర్‌ (30*; 48 బం­తు­ల్లో, 4 ఫో­ర్లు) ఉన్నా­రు.

Tags:    

Similar News