AUS vs IND: సమం చేస్తారా..? సమర్పించేస్తారా.?

ఆడిలైడ్ వేదికగా నేడు రెండో వన్డే.. అందరి కళ్లు రోహిత్, కోహ్లీపైనే.. ఓడితే సిరీస్ ఆసిస్ కైవసం

Update: 2025-10-23 02:00 GMT

ఆస్ట్రే­లి­యా­తో జరి­గిన తొలి వన్డే­లో తీ­వ్రం­గా ని­రా­శ­ప­రి­చిన టీ­మిం­డి­యా సీ­ని­య­ర్ ఆట­గా­ళ్లు వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శర్మ­పై అం­ద­రి దృ­ష్టీ ని­లి­చిం­ది. ఏడు నెలల సు­దీ­ర్ఘ వి­రా­మం తర్వాత బరి­లో­కి ది­గిన ఈ ది­గ్గ­జా­లు పె­ర్త్‌­లో వి­ఫ­ల­మై­న­ప్ప­టి­కీ, నేడు అడి­లై­డ్ వే­ది­క­గా జరి­గే రెం­డో వన్డే­లో సత్తా చా­టేం­దు­కు సి­ద్ధ­మ­వు­తు­న్నా­రు. ము­ఖ్యం­గా, అడి­లై­డ్ ఓవల్ మై­దా­నం వి­రా­ట్ కో­హ్లీ­కి అచ్చొ­చ్చిన వే­దిక కా­వ­డం­తో అభి­మా­ను­ల్లో ఆశలు చి­గు­రి­స్తు­న్నా­యి. . పె­ర్త్ వే­ది­క­గా జరి­గిన తొలి వన్డే­లో ఏడు వి­కె­ట్ల తే­డా­తో పరా­జ­యం పా­లైం­ది. దీం­తో సి­రీ­స్‌ 0-1తో వె­న­క­బ­డి పో­యిం­ది. అయి­తే తొలి వన్డే­లో టీ­మిం­డి­యా తుది జట్టు ఎం­పి­క­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు వచ్చా­యి. ము­ఖ్యం­గా స్టా­ర్ స్పి­న్న­ర్ కు­ల్‌­దీ­ప్ యా­ద­వ్‌­ను బెం­చ్‌­పై కూ­ర్చో­బె­ట్ట­డం.. ము­గ్గు­రు ఆల్‌­రౌం­డ­ర్ల­తో బరి­లో­కి ది­గ­డం వి­వా­దా­స్ప­దం­గా మా­రిం­ది. ఈ నే­ప­థ్యం­లో రెం­డో వన్డే­కు ముం­దు టీ­మిం­డి­యా తుది జట్టు­లో మా­ర్పు­లు జరి­గే అవ­కా­శం ఉంది.

సి­రీ­స్‌­లో ని­ల­వా­లం­టే రెం­డో వన్డే­లో భా­ర­త్ తప్పక గె­ల­వా­ల్సిం­దే. గు­రు­వా­రం ఆడి­లై­డ్ వే­ది­క­గా ఈ మ్యా­చ్ జర­గ­నుం­ది. ఏడు నెలల వి­రా­మం తర్వాత టీ­మిం­డి­యా తర­పున బరి­లో­కి ది­గిన వి­రా­ట్ కో­హ్లీ, రో­హి­త్ శర్మ ని­రా­శ­ప­రి­చా­రు. అయి­న­ప్ప­టి­కీ వా­రి­ద్ద­రూ తుది జట్టు­లో కొ­న­సా­గ­ను­న్నా­రు. మరో­వై­పు తొలి వన్డే­లో బెం­చ్‌­కు పరి­మి­త­మైన కు­ల్‌­దీ­ప్ యా­ద­వ్ .. తుది జట్టు­లో­కి రా­ను­న్నా­డు. అత­డి­ని ఎం­దు­కు పక్కన పె­ట్టా­ర­ని ఇప్ప­టి­కే మా­జీల నుం­చి ప్ర­శ్న­లు వచ్చా­యి. అదీ కా­కుం­డా భారత బౌ­ల­ర్లు తే­లి­పో­వ­డం­తో కు­ల్‌­దీ­ప్ లాం­టి వి­కె­ట్ టే­క­ర్ అవ­స­ర­మైన డి­మాం­డ్‌­లు సైతం వి­ని­పి­స్తు­న్నా­యి. కు­ల్‌­దీ­ప్ యా­ద­వ్ కోసం వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్‌­పై వేటు వేసే అవ­కా­శం ఉంది. మరో­వై­పు తొలి వన్డే­లో తే­లి­పో­యిన పే­స­ర్ హర్షి­త్ రాణా సైతం బెం­చ్‌­కే పరి­మి­తం కా­ను­న్నా­డు.

రో-కో ఏం చేస్తారో...

గత రి­కా­ర్డు­లు పరి­శీ­లి­స్తే అడి­లై­డ్‌­ను కో­హ్లీ­కి కం­చు­కో­ట­గా చె­ప్ప­వ­చ్చు. ఈ మై­దా­నం­లో ఇప్ప­టి­వ­ర­కు నా­లు­గు వన్డే­లు ఆడిన కో­హ్లీ, 61 సగ­టు­తో 244 పరు­గు­లు చే­శా­డు. ఇం­దు­లో రెం­డు సెం­చ­రీ­లు ఉం­డ­టం వి­శే­షం. కే­వ­లం వన్డే­ల్లో­నే కా­కుం­డా, టె­స్టు­ల్లో­నూ ఇక్కడ అతడి రి­కా­ర్డు అద్భు­తం­గా ఉంది. ఐదు టె­స్టు మ్యా­చ్‌­ల­లో 53.70 సగ­టు­తో 537 పరు­గు­లు సా­ధిం­చా­డు. ఇం­దు­లో మూడు సెం­చ­రీ­లు ఉన్నా­యి. అన్ని ఫా­ర్మా­ట్లు కలి­పి అడి­లై­డ్‌­లో 12 మ్యా­చ్‌­లు ఆడిన వి­రా­ట్, 65 సగ­టు­తో 975 పరు­గు­లు చేసి ఐదు శత­కా­లు నమో­దు చే­శా­డు. మరో­వై­పు రో­హి­త్ శర్మ­కు మా­త్రం ఈ మై­దా­నం­లో సా­ధా­రణ రి­కా­ర్డే ఉంది. ఇక్కడ ఆడిన ఆరు వన్డే­ల్లో 21.83 సగ­టు­తో కే­వ­లం 131 పరు­గు­లే చే­శా­డు.

పె­ర్త్‌­లో జరి­గిన సి­రీ­స్ తొలి మ్యా­చ్‌­లో రో­హి­త్ 8 పరు­గు­ల­కే వె­ను­ది­ర­గ్గా, కో­హ్లీ ఎని­మి­ది బం­తు­లు ఆడి డకౌ­ట్‌­గా పె­వి­లి­య­న్ చే­రా­డు. అయి­తే ఈ ప్ర­ద­ర్శ­న­పై ఆం­దో­ళన చెం­దా­ల్సిన అవ­స­రం లే­ద­ని భారత క్రి­కె­ట్ ది­గ్గ­జం సు­నీ­ల్ గవా­స్క­ర్ అభి­ప్రా­య­ప­డ్డా­డు. "ఆస్ట్రే­లి­యా­లో­నే అత్యంత బౌ­న్స్ ఉండే పి­చ్‌­పై వారు ఆడా­రు. చాలా నెలల తర్వాత అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ ఆడు­తు­న్న వా­రి­కి అది అంత సు­ల­భం కాదు. శు­భ్‌­మ­న్ గిల్, శ్రే­య­స్ అయ్య­ర్ వంటి రె­గ్యు­ల­ర్ ఆట­గా­ళ్ల­కే అక్కడ సవా­ల్ ఎదు­రైం­ది" అని గవా­స్క­ర్ వి­వ­రిం­చా­రు. ఈ మ్యాచులో గెలిచి భారత్ పోటీలో ఉండాలని గవాస్కర్ అభిలాషించాడు. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News