Cameron Green : ఆస్ట్రేలియాకు భారీ షాక్–బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి స్టార్ ఆల్‌రౌండర్ దూరం
టీమిండియాతో జరగనున్న బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీకి ముందే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.ఈ ట్రోఫీలో భాగంగా భారత్‌తో ఆసీస్ స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ మూడో వారం నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగబోతోంది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆడటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వెన్ను నొప్పి కోసం శస్త్రచికిత్స చేయించుకొనేందుకు గ్రీన్ సిద్ధమైనట్లు పేర్కొంది. అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో శస్త్రచికిత్స చేయించుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పితో అర్ధంతరంగా స్వదేశానికి తిరిగొచ్చాడు. ‘పేస్ బౌలర్లకు వెన్నెముకలో పగుళ్లు అసాధారణం కానప్పటికీ.. కామెరూన్ గ్రీన్ విషయంలో మరింత గాయం కావడానికి మాత్రం అదే కారణం. వైద్య నిపుణులు నిశితంగా పరిశీలించాక గ్రీన్‌కు శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. సర్జరీ చేస్తేనే ప్రయోజనం ఉంటుందని వారి భావన. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను అడ్డుకోవావాలంటే శస్త్రచికిత్సకు వెళ్లడమే మంచిది. అయితే, అతడు కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా పోస్టు పెట్టింది.