BCCI: భారత్-బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

Update: 2025-07-06 05:00 GMT

అను­కు­న్న­దే జరి­గిం­ది. ఆగ­స్టు­లో జర­గా­ల్సిన భా­ర­త్, బం­గ్లా­దే­శ్ మధ్య వైట్-బాల్ సి­రీ­స్ వా­యి­దా పడిం­ది. బం­గ్లా­దే­శ్ క్రి­కె­ట్ బో­ర్డు, బీ­సీ­సీఐ పర­స్పర అం­గీ­కా­రం­తో ఈ సి­రీ­స్‌­ను ఆగ­స్టు 2025 నుం­చి సె­ప్టెం­బ­ర్ 2026కి వా­యి­దా వే­సి­న­ట్లు ప్ర­క­టిం­చా­యి. వా­స్త­వా­ని­కి ఆగ­స్టు 17 నుం­చి మూడు వన్డే­లు, మూడు టీ20 మ్యా­చ్‌­లు జర­గా­ల్సి ఉంది. అయి­తే కేం­ద్ర ప్ర­భు­త్వం బీ­సీ­సీ­ఐ­కి ఈ పర్య­ట­న­తో ముం­దు­కు వె­ళ్ల­వ­ద్ద­ని సలహా ఇచ్చి­న­ట్లు తె­లు­స్తోం­ది. భా­ర­త్, బం­గ్లా­దే­శ్ మధ్య పె­రు­గు­తు­న్న రా­జ­కీయ ఉద్రి­క్త­తల నే­ప­థ్యం­లో ఈ సి­రీ­స్‌­పై కొ­న్ని సం­దే­హా­లు నె­ల­కొ­న్నా­యి. “ఇరు బో­ర్డుల మధ్య చర్చల తర్వాత, అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ షె­డ్యూ­ల్, జట్ల సౌ­ల­భ్యా­న్ని దృ­ష్టి­లో ఉం­చు­కొ­ని ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నాం. పర్య­ట­న­కు సం­బం­ధిం­చి సవ­రిం­చిన తే­దీ­లు, మ్యా­చ్‌ల వి­వ­రా­లు త్వ­ర­లో ప్ర­క­టి­స్తాం” అని బీ­సీ­సీఐ ప్ర­క­ట­న­లో తె­లి­పిం­ది.

రోకో కోసం ఎదురుచూపులు

ఐకా­ని­క్ జోడీ రో­హి­త్ శర్మ, వి­రా­ట్ కో­హ్లీ తి­రి­గి మై­దా­నం­లో­కి అడు­గు­పె­ట్ట­డా­న్ని చూ­డా­ల­ని అభి­మా­ను­లు ఎంతో ఆతృ­త­గా ఉన్నా­రు. అయి­తే, వారు టీ20 అం­త­ర్జా­తీయ, టె­స్ట్ క్రి­కె­ట్‌ల నుం­డి రి­టై­ర్ అయిన తర్వాత కే­వ­లం వన్డే ఫా­ర్మా­ట్‌­పై దృ­ష్టి సా­రిం­చా­రు. 2027 ప్ర­పంచ కప్ వారి టా­ర్గె­ట్. వా­స్త­వా­ని­కి, ఆగ­స్టు 2025లో జర­గా­ల్సిన ఈ వైట్-బాల్ సి­రీ­సు­తో వారి రీ­ఎం­టీ ఇస్తా­ర­ని భా­విం­చా­రు. కానీ, సి­రీ­స్ ఇప్పు­డు సె­ప్టెం­బ­ర్ 2026కి వా­యి­దా పడ­టం­తో ‘రో-కో’ మ్యా­జి­క్‌­ను మళ్లీ చూ­డ­టా­ని­కి అభి­మా­ను­లు మరింత ఓపిక పట్టా­ల్సి ఉం­టుం­ది. ప్ర­స్తు­తం టీ­మిం­డి­యా ఇం­గ్లాం­డ్‌­తో ఐదు మ్యా­చ్‌ల టె­స్ట్ సి­రీ­స్‌­లో తల­ప­డు­తోం­ది.

Tags:    

Similar News