RCB Announces : బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ రూ.25లక్షల పరిహారం

Update: 2025-08-30 09:30 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జూన్ 4న ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే. ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తొక్కిసలాటకు ప్రధాన కారణాలు అంచనాలకు మించి అభిమానులు రావడం (సుమారు 35 వేల మంది వస్తారని భావిస్తే 2-3 లక్షల మంది వరకు వచ్చారు), ఉచిత పాస్‌లు, భద్రతా లోపాలు అని అధికారులు తెలిపారు. మొదట, ఆర్సీబీ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ తర్వాత, ఆర్సీబీ 'ఆర్సీబీ కేర్స్' పేరిట ఫండ్ ఏర్పాటు చేసి, పరిహారాన్ని రూ. 25 లక్షలకు పెంచింది.కర్ణాటక ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం, ఈ దుర్ఘటనకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని తేలింది.ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News