AP CM : టైటిల్ తీస్కొని రా.. కోనేరు హంపికి సీఎం చంద్రబాబు విషెస్..

Update: 2025-07-21 12:15 GMT

జార్జియాలో జరుగుతున్న ఫీడే మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సెమీ ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సెమీస్ లో అడుగుపెట్టిన తొలి భారతీయురాలిగా ఆమె ఘనత సాధించింది. ఈ మేరకు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కోనేరు హంపి కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు కోనేరు హంపి నీ అభినందించారు. ఫీడే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్కు చేరిన తొలి భారత మహిళగా ఆమె అరుదైన రికార్డు సాధించారని.. అంతర్జాతీయ వేదిక పై ఆమె మరింత ప్రకాశించాలని ఆకాంక్షించారు. ."హంపి సాధించిన విజయం పట్ల గర్వంగా ఉంది. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. భారతీయ చెస్ కు గర్వకారణం అని... దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఫైనల్ లో గెలిచి టైటిల్ ను ఇంటికి తీసుకురావాలని” సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కోరారు.

కాగా అంతకు ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కోనేరు హంపి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన.. కోనేరు హంపి తెలుగు ప్రజలకు గర్వకారణం అని...ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను' అని విషెస్ తెలిపారు. కాగా, ఫిడే మహిళల వరల్డ్ కప్లో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపీ 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగై పై విజయం సాధించింది.

Tags:    

Similar News