Cricket : తీవ్రమైన బాధతో దిగిపోతున్నా.. బట్లర్ ఎమోషనల్ పోస్ట్

Update: 2025-03-03 16:00 GMT

వన్డే, టీ20ల్లో వరుస ఓటములతో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘"ఇంగ్లండ్‌ వైట్ బాల్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నందుకు చాలా బాధగా ఉంది. దేశానికి సార‌థ్యం వ‌హించ‌డం నాకు లభించిన గొప్ప గౌరవం. దీనికి నేను ఎల్లప్పుడూ గర్వపడతాను. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం. నేను కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో నాకు మద్దతు ఇచ్చిన ఆటగాళ్లు, సిబ్బంది, ఇంగ్లండ్‌ అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా భార్య లూయిస్, నా కుటుంబానికి థ్యాంక్స్‌. వారే నా ఎత్తుపల్లాలతో కూడిన ఈ జ‌ర్నీకి అస‌లైన స్తంభాలు" అని బ‌ట్ల‌ర్ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

2022 జూన్‌లో బట్లర్‌ ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టుకు వన్డే, టీ20 ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇయాన్‌ మోర్గాన్‌ నుంచి బట్లర్‌ బాధ్యతలు స్వీకరించాడు. జోస్‌ బట్లర్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ 2022 టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది. అయితే, ఆ తర్వాత ఆ జట్టు దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసింది. బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీమ్‌ 34 వన్డేలు ఆడింది. అందులో 22 మ్యాచులలో ఓడిపోయింది. కేవలం 12 మ్యాచ్‌లలోనే గెలిచింది.

Tags:    

Similar News