CT2025: సెమీస్ లో భారత్-ఆస్ట్రేలియా ఢీ
మంగళవారం తొలి సెమీఫైనల్.. న్యూజిలాండ్ తో దక్షిణాఫ్రికా పోరు;
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లేవో తేలిపోయాయి. గ్రూపు-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూపు-బి నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా నాకౌట్‌కు చేరుకున్నాయి. టీమిండియా మూడు విజయాలతో 6 పాయింట్లు సాధించి గ్రూపు-ఏలో అగ్రస్థానంలో నిలిచింది. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం ఈ మ్యాచ్ జరగనుంది. మరో మ్యాచులో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా కోహ్లీ..మంగళవారం తొలి సెమీఫైనల్.. న్యూజిలాండ్ తో దక్షిణాఫ్రికా పోరు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తాజాగా తన కెరీర్‌లో 300వ వన్డే మ్యాచ్ ఆడి రికార్డుకెక్కాడు. ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా 300వ వన్డేలు ఆడిన 18వ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ 18 మంది క్రికెటర్లలో ఒక్కరూ కూడా T20, టెస్టుల్లో జాతీయ జట్టు తరఫున 100 మ్యాచులు ఆడలేదు. కానీ విరాట్ మాత్రం 300 వన్డేలతో పాటు 100 టీ20లు, 100 టెస్ట్ మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. వరుసగా 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో టాస్ ఓడిన మూడో కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు వరుసగా 10 వన్డే మ్యాచ్‌లలో టాస్ ఓడాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా (12 సార్లు) తొలి స్థానంలో ఉండగా న్యూజిలాండ్ కెప్టెన్ పీటర్ బోరెన్ (11 సార్లు) రెండో స్థానంలో నిలిచాడు.
కోహ్లీ ఫిట్‌నెస్ అత్యుత్తమం: మాజీ కోచ్
రన్ మిషన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఇప్పటికీ కోహ్లీలో పరుగుల దాహం అలానే ఉంది. సచిన్ నెలకొల్పిన చాలా రికార్డులను విరాట్ అధిగమించాడు. భవిష్యత్తులో కూడా మరిన్ని బద్దలు కొడతాడని అంచనా వేస్తున్నా. 36 ఏళ్ల వయసులోనూ చాలా ఫిట్‌గా ఉన్నాడు. 300వ మ్యాచ్‌లోనూ ప్రత్యేకత చూపిస్తాడని భావిస్తున్నా. అతడి విలువేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు’ అని వెల్లడించారు.