Cricket : రెండో టెస్టులో దుమ్మురేపుతున్న టీమిండియా
తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు వెనుకబడ్డ టిమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ను 113 పరుగులకే కట్టడి చేసింది;
రెండో టెస్టులో భారత్ దుమ్ములేపుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు వెనుకబడ్డ టిమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ ను 113 పరుగులకే కట్టడి చేసింది. భారత స్పిన్ ద్వయం జడేజా- అశ్విన్ దాటికి ఆసీస్ విలవిలలాడింది. జడేజా వేసే బంతులకు ఆసీస్ ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. బంతి ఎక్కడ వేసిన గింగిరాలు తిరుగుకుంటూ వికెట్ల వైపు దూసుకెళ్లడంతో ఆసీసీ బ్యాట్స్ మెన్స్ ఉక్కిరి బిక్కిరయ్యారు. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్స్‌లో ట్రావిస్ హెడ్ 43 పరుగులు చేయగా లబుషేన్ 35 పరుగులు చేశాడు. ఇక మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. భారత బౌలరల్లో జడేజా ఏడు వికెట్లు పడగొట్టగా అశ్విన్ మూడు వికెట్లు తీశాడు.