Cristiano Ronaldo: గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజు కోసం రూ.50 లక్షలు ఖర్చు చేసిన ఆటగాడు..
Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో గురించి స్పోర్ట్స్ లవర్స్‌కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.;
Cristiano Ronaldo: మామూలుగా గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజుకు ఎంత ఖర్చు అయినా ఆలోచించకుండా పెట్టేవారు ఉంటారు. అందులోనూ సెలబ్రిటీలు అయితే ఈ విషయంలో మరీ ముందుంటారు. ఖర్చుకు వెనకాడకుండా పుట్టినరోజులను రిచ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆటగాడు తన గర్ల్‌ఫ్రెండ్ పుట్టినరోజు కోసం ఏకంగా 67,000 డాలర్లు అంటే రూ. 50 లక్షలు ఖర్చు చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
క్రిస్టియానో రొనాల్డో గురించి స్పోర్ట్స్ లవర్స్‌కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫుట్‌బాల్ ఆటలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన రొనాల్డో ఏం చేసినా కాస్ట్లీగానే ఉంటుంది. ఈ ఆటగాడు ఏం చేసినా అది కచ్చితంగా వైరల్ అయ్యే అంశంగానే ఉంటుంది. ఇటీవల తన గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడంతో మరోసారి రొనాల్డో పేరు వార్తల్లోకెక్కింది.
క్రిస్టియానో రొనాల్డో గతకొంతకాలంగా జార్జినా రాడ్రిగూజ్ అనే మోడల్‌తో చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. వీరిద్దరికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. ప్రస్తుతం జార్జినా ప్రెగ్నెంట్‌గా ఉంది. అయితే ఇటీవల తన 28వ ఏట అడుగుపెట్టిన జార్జినాకు రొనాల్డో ఓ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫైపై జార్జినా వీడియోను ప్లే చేసి తనకు పుట్టినరోజు విషెస్ తెలిపాడు రొనాల్డో. ఆ స్పెషల్ వీడియో కోసం రొనాల్డోకు 67,000 డాలర్లు ఖర్చు అయ్యిందట. అంటే ఇండియన్ కరెన్సీలో దాని విలువ రూ. 50 లక్షలు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. రొనాల్డో ఇచ్చిన ఈ స్వీట్ సర్‌ప్రైజ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.