De Cock : డికాక్ విధ్వంసకర శతకం : గయానా వారియర్స్ పై బార్బోడస్ రాయల్స్ విక్టరీ
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ క్వింటన్ డికాక్ మరోసారి టీ20 మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. దీంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్ లో బార్బడోస్ రాయల్స్ విజయం సాధించింది. కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో బార్బడోస్ రాయల్స్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బార్బోడస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బార్బోడస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ విధ్వంసకర సెంచరీతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎనిమిది ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 68 బంతుల్లోనే 115 పరుగులు చేశాడు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. యానా బ్యాటర్లలో షాయ్ హోప్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు మొయిన్ అలీ(33), కీమో పాల్(30) తమవంతు ప్రయత్నం చేసినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 3 వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ రెండు వికెట్లు సాధించారు.