Ambati Rayudu : ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

Update: 2025-03-29 11:15 GMT

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్‌లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.

సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించిన బెంగళూరు.. చెన్నైని సునాయాసంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB 20 ఓవర్లలో 196/7 రన్స్ చేసింది. అనంతరం చెన్నై 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రచిన్ ఒక్కడే 41 పరుగులతో రాణించారు. చివర్లో ధోనీ (30*) రెండు సిక్సర్లు కొట్టి అభిమానుల్లో జోష్ నింపారు.

Tags:    

Similar News