ENG VS IND: రెండో టెస్టుపై పట్టు బిగించిన భారత్
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పైచేయి...తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగుల ఆధిక్యం;
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బర్మింగ్ హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టెస్ట్‌పై టీమిండియా పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు... రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తోంది. ఇప్పటికే 268 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత జట్టు నాలుగు రోజు మరిన్ని పరుగులు సాధిస్తే సిరీస్‌పై గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆరేసిన సిరాజ్ మియా
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న రెండవ టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 407 పరుగులకే కట్టడి చేశారు. భారత స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు. దీంతో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 269 పరుగులతో రాణించగా, జడేజా (89), జైస్వాల్ (87), వాషింగ్టన్ (42) లతో భారీ స్కోరుకు తోడ్పాటు అందించారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. మొదటి 5 వికెట్లు 84 పరుగులకే కోల్పోయిన అనంతరం, హ్యారీ బ్రూక్ (158), జేమీ స్మిత్ (184) భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరూ 300కి పైగా భారీ పార్టనర్షిప్ స్కోరు చేసి ఇంగ్లాండ్‌ను గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. అయితే బ్రూక్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, చివరకు 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో సిరాజ్ విజృంభించాడు. అతను 19.3 ఓవర్లలో 70 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా, అకాష్ దీప్ 4 వికెట్లు తీసి సిరాజ్‌కు అద్భుతంగా సహకరించాడు. మిగిలిన బౌలర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్ లో 200–250 పరుగులు చేస్తే, ఇంగ్లాండ్‌కు 400కి పైగా లక్ష్యంగా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్లకు నాలుగో, ఐదో రోజుల్లో సహాయం దక్కే అవకాశం ఉండటంతో.. భారత్ విజయం వైపు అడుగులు వేయవచ్చు
సెంచరీలతో చెలరేగిన బ్రూక్, స్మిత్
80 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న బ్రిటీష్ జట్టును బ్రూక్, స్మిత్ ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అద్భుతమైన శతకాలతో భారత బౌలింగ్‌ను నిలువరించారు. జెమీ స్మిత్ 184 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హ్యారీ బ్రూక్ 158 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగతా ఇంగ్లాండ్ బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్ కావడం గమనార్హం. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ 180 పరుగుల వెనుకంజలో ఉంది.
రాణించిన భారత బ్యాటర్లు
180 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత బ్యాటర్లు మరోసారి రాణించారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 64 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (28*), కరుణ్ నాయర్ (7) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (28) పరుగులు చేశాడు. 51 పరుగుల వద్ద జోష్ టంగ్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది.