ENGLAND: ఇదేనా.. జెంటిల్మెన్ క్రికెట్

ఇంగ్లాండ్ జట్టుపై తీవ్ర విమర్శలు... సెంచరీలకు ముందు డ్రా ప్రతిపాదన... భారత దెబ్బకు దిమ్మతిరిగిన బ్రిటీష్ జట్టు;

Update: 2025-07-29 05:30 GMT

మాం­చె­స్ట­ర్ టె­స్టు­లో భా­ర­త్ కొ­ట్టిన దె­బ్బ­కు... ఇం­గ్లాం­డ్ ది­మ్మ తి­రి­గి­పో­యిం­ది. గె­లు­పు ఖా­య­మ­ని సం­బ­ర­ప­డ్డ బ్రి­టీ­ష్ జట్టు­ను.. ఇం­డి­యా టీం చావు దె­బ్బ కొ­ట్టిం­ది. మై­దా­నం­లో ఒకలా ప్ర­వ­ర్తిం­చి తమ జట్టు­కు ఫలి­తం అను­కూ­లం­గా తె­చ్చేం­దు­కు ఇం­గ్లాం­డ్ ఆట­గా­ళ్లు ప్ర­య­త్ని­స్తుం­టా­రు. ప్ర­త్య­ర్థి జట్టు­పై మాటల యు­ద్ధ­మే చే­స్తా­రు. అది బూ­మ­రాం­గ్‌ అయి­తే మా­త్రం ప్రె­స్ కా­న్ఫ­రె­న్స్‌­ల్లో భి­న్నం­గా స్పం­దిం­చి కవ­ర్‌ చే­సు­కొ­నేం­దు­కు ప్ర­య­త్ని­స్తా­రు. మాం­చె­స్ట­ర్‌ వే­ది­క­గా జరి­గిన నా­లు­గో టె­స్టు­లో­నూ ఇం­గ్లాం­డ్‌ కె­ప్టె­న్ బె­న్‌­స్టో­క్స్ వా­డిన పదా­లు.. ఆ తర్వాత మా­ట్లా­డిన మా­ట­లే ఇం­దు­కు ప్ర­త్య­క్ష ఉదా­హ­రణ. మ్యా­చ్‌ సమ­యం­లో ‘బ్రూ­క్‌ బౌ­లిం­గ్‌­లో సెం­చ­రీ చే­ద్దాం అను­కుం­టు­న్నా­వా’ అని స్టో­క్స్‌.. జడ్డూ­తో వె­ట­కా­రం­గా అన్నా­డు. కానీ భారత బ్యా­ట­ర్లు ఆ మా­ట­లే­వీ పట్టిం­చు­కో­లే­దు. మ్యా­చ్‌ ము­గి­శాక బె­న్‌ స్టో­క్స్ మా­త్రం తమ బౌ­ల­ర్ల కో­స­మే ఇలా చే­శా­నం­టూ కబు­ర్లు చె­ప్పు­కొ­చ్చా­డు.

సెంచరీకి దగ్గరగా డ్రా ప్రతిపాదన

అప్ప­టి­కే జడే­జా, సుం­ద­ర్‌ 90ల వద్ద ఉన్నా­రు. మ్యా­చ్‌ చే­జా­రి­పో­యిం­ద­నే ఫ్ర­స్ట్రే­ష­న్‌­లో ఇం­గ్లాం­డ్‌ ఆట­గా­ళ్లు తమ నో­టి­కి పని­జె­ప్పా­రు. ఇక డ్రా కోసం ప్ర­తి­పా­దిం­చే సమ­యం­లో స్లె­డ్జిం­గ్‌­తో రె­చ్చ­గొ­ట్టా­రు. మనో­ళ్లు ఆటను ము­గిం­చ­ర­ని భా­విం­చ­డం­తో బ్రూ­క్‌­ను బౌ­లిం­గ్‌­కు తీ­సు­కొ­చ్చా­డు కె­ప్టె­న్ స్టో­క్స్. సా­ధా­ర­ణం­గా బ్రూ­క్‌ కూడా మంచి బౌ­లిం­గే చే­స్తా­డు. ఓవై­పు రూ­ట్‌ మా­త్రం కట్టు­ది­ట్టం­గా బం­తు­లే­స్తుం­టే.. బ్రూ­క్ మరీ గల్లీ క్రి­కె­ట్‌­లో పో­ర­గా­ళ్లు ప్ర­వ­ర్తిం­చి­న­ట్లు వ్య­వ­హ­రిం­చా­డు. ‘కొ­ట్టు­కోం­డి. మీకు కా­వా­ల్సిం­ది సెం­చ­రీ­నే కదా’ అన్న­ట్లు­గా ఫు­ల్‌­టా­స్‌­లు వే­శా­డు. ఫీ­ల్డిం­గ్‌ సె­ట­ప్‌ కూడా అం­ద­రి­నీ బ్యా­ట­ర్‌­కు దగ్గ­ర­గా తీ­సు­కు­రా­వ­డం మరింత వి­మ­ర్శ­ల­కు దా­రి­తీ­సిం­ది. త్వ­ర­గా సెం­చ­రీ­లు చే­సే­స్తే మే­మం­తా వె­ళ్లి­పో­తా­మ­న్న­ట్లు­గా­నే ఇం­గ్లాం­డ్ ఆట­గా­ళ్లు ప్ర­వ­ర్తిం­చా­రు. ఓటమి నుం­చి జట్టు­ను కా­పా­డిన బ్యా­ట­ర్లు సెం­చ­రీ­ల­కు చే­రు­వ­గా ఉన్న­ప్పు­డు ఎవ­రై­నా ఆటను ఆపా­ల­ను­కో­రు. కానీ, ఇం­గ్లాం­డ్‌ కె­ప్టె­న్ బెన్ స్టో­క్స్‌ మా­త్రం డ్రా కోసం ప్ర­తి­పా­దన చే­శా­డు. దా­ని­కి కా­ర­ణం ప్ర­త్య­ర్థి ప్లే­య­ర్లు జడే­జా, సుం­ద­ర్ ఆ ఫీ­ట్‌­ను సా­ధిం­చేం­దు­కు సి­ద్ధం కా­వ­డ­మే. అయి­తే, మన సా­ర­థి శు­భ్‌­మ­న్‌ గిల్ ఏమా­త్రం కం­గా­రు­ప­డ­లే­దు. సెం­చ­రీ­లు చే­శా­క­నే మై­దా­నం వీ­డం­డం­టూ వా­రి­కి భరో­సా ఇచ్చా­డు.

స్టోక్స్ ఇదేనా స్పోర్ట్స్ స్పిరిట్

ప్ర­స్తు­త­త­రం­లో గొ­ప్ప ఆల్‌­రౌం­డ­ర్‌­గా మా­రా­డ­ని క్రి­కె­ట్‌ వ్యా­ఖ్యా­త­లు, అభి­మా­ను­లు ఓవై­పు పొ­గు­డు­తుం­టే.. బె­న్‌ స్టో­క్స్ మా­త్రం క్రీ­డా­స్ఫూ­ర్తి­కి వి­రు­ద్ధం­గా ప్ర­వ­ర్తిం­చ­డం గమ­నా­ర్హం. సి­రా­జ్‌ బౌ­లిం­గ్‌­లో గా­య­ప­డిన తర్వాత సెం­చ­రీ చే­సిన అతడి ఆటను మాం­చె­స్ట­ర్‌­లో­ని భారత ప్రే­క్ష­కు­లూ ఆస్వా­దిం­చి అభి­నం­దిం­చా­రు. అతడు గా­యం­తో ఇబ్బం­ది పడు­తూ­నే బౌ­లిం­గ్‌ చే­సిన తీరూ ఆక­ట్టు­కుం­ది. కానీ, మ్యా­చ్‌ ము­గి­సిన తర్వాత కూడా భారత ఆట­గా­ళ్ల­తో హృ­ద­య­పూ­ర్వ­కం­గా కర­చా­ల­నం చే­సేం­దు­కు కూడా ఆస­క్తి చూ­ప­లే­దు. తన టీ­మ్‌ గొ­ప్ప­గా ఆడి­న­ప్పు­డు సం­బ­ర­ప­డ­టం తప్పు లేదు.. కానీ, ప్ర­త్య­ర్థి జట్టు బాగా ఆడి­న­ప్పు­డు అభి­నం­దిం­చ­లే­ని కు­సం­స్కా­రం మా­త్రం ఉం­డ­కూ­డ­దు. ఈ వి­ష­యం­లో స్టో­క్స్‌­పై ‘రె­స్పె­క్ట్‌’ తగ్గిం­దం­టూ నె­ట్టింట కా­మెం­ట్లు వై­ర­ల్ అవు­తు­న్నా­యి.

Tags:    

Similar News