WPL History : WPL చరిత్రలో తొలి సూపర్ ఓవర్.. యూపీ వారియర్స్ విజయం

Update: 2025-02-25 08:15 GMT

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం నమోదైంది. బెంగళూరు, యూపీ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌‌కు దారి తీసింది. తొలుత ఆర్సీబీ 180 రన్స్ చేసింది. ఛేదనలో యూపీ కూడా 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టోర్నీ చరిత్రలో తొలిసారి సూపర్ ఓవర్ జరగనుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో జరిగిన తొలి సూపర్ ఓవర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. 9 రన్స్ టార్గెట్‌‌తో బరిలోకి దిగిన ఆర్సీబీని ఆ జట్టు 4 పరుగులకే కట్టడి చేసింది. యూపీ బౌలర్ సోఫీ ఎకిల్‌స్టన్ సూపర్ ఓవర్‌లో కేవలం 4 పరుగులే ఇచ్చి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన సోఫీ 19 బంతుల్లో 33 రన్స్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకొచ్చారు.

Tags:    

Similar News