Virat Kohli: విరాట్ కోహ్లీ @ 'బ్లాక్ వాటర్'.. లీటర్ ధర తెలిస్తే షాకే..
కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్ యూనిట్లలో ఒకటిగా ఉంది.;
Virat Kohli: విరాట్ కోహ్లీ తన కెరీర్‌ను పొడిగించడానికి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్ యూనిట్లలో ఒకటిగా ఉంది. ఇటీవల శాకాహారిగా మారడం దగ్గర నుండి అన్ని రకాల జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండటం వరకు, కోహ్లీ క్రమశిక్షణ అతని అభిమానులకు స్ఫూర్తినిస్తుంది. అతడు తన ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. కోహ్లీ అనేక సందర్భాల్లో 'బ్లాక్ వాటర్' బాటిల్‌ని విమానాశ్రయానికి తీసుకెళ్తూ కనిపిస్తాడు.
ఈ బ్లాక్ వాటర్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇందులో సహజ-నలుపు ఆల్కలీన్ నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచటానికి సహాయపడుతుంది. 'బ్లాక్ వాటర్' లో pH ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. చర్మ నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని, బరువును అదుపులో ఉంచుతుందని, డిప్రెషన్‌ను తగ్గించడంలో హాయపడుతుందని అంటారు. మరి ఇన్ని మంచి గుణాలున్న ఈ బ్లాక్ వాటర్ లీటరు ధర దాదాపు రూ.3000-4000 లు.
మలైకా అరోరా, ఊర్వశి రౌతేలా, శ్రుతి హసన్ వంటి చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు మరికొంత సెలబ్రెటీలు కూడా ఈ బ్లాక్ వాటర్‌ని వినియోగిస్తారు.