Former Cricketer Dies : గుండెపోటుతో మాజీ క్రికెటర్ మృతి

Update: 2024-12-24 18:00 GMT

గుండెపోటు మరణాలు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. బెంగాల్‌కు చెందిన మాజీ క్రికెటర్ సువోజిత్ బెనర్జీ (39) గుండెపోటుతో మరణించారు. బెంగాల్ తరఫున 3 రంజీ మ్యాచులు, 4 లిస్ట్-A మ్యాచులు ఆడిన ఆయన ప్రస్తుతం లోకల్ టోర్నీల్లో ఆడుతున్నారు. నిన్న బ్రేక్ ఫాస్ట్ అనంతరం కునుకు తీసిన ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

గుండెపోటుతో మరణించిన సువోజిత్ బెనర్జీ మూడు రంజీ మ్యాచ్ లు ఆడాడట. 2014లో ఒడిషాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేశాడు బెనర్జీ. ఆ సీజన్‌లో మూడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. అలాగే నాలుగు… లిస్ట్ – A మ్యాచ్లు ఆడినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం… రంజిత్ ట్రోఫీలకు దూరంగా ఉంటున్న బెనర్జీ… చిన్నచిన్న టోర్నీలలో మాత్రమే ఆడుతున్నాడట. రెగ్యులర్ క్రికెట్కు దూరంగా ఉంటూ… అప్పుడప్పుడు మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపించేవాడట సువోజిత్ బెనర్జీ.

Tags:    

Similar News