Cricketer Milind Rege : మాజీ క్రికెటర్ మిలింద్ రేగే కన్నుమూత

Update: 2025-02-19 14:00 GMT

ఫస్ట్ క్లాస్ క్రికెటర్, ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ రేగే(76) కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూశారు. సునీల్ గవాస్కర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం మిలింద్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు అడ్వైజర్‌గా ఉన్నారు. 26 ఏళ్ల వయసప్పుడే హార్ట్‌ ఎటాక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. మిలింద్ ముంబై తరఫున 52 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో ఎన్నో సేవలు అందించారు. మేనేజింగ్ కమిటీ మెంబర్, సెలక్టర్, కామెంటేటర్, ఆ తర్వాత అడ్వైజర్‌గానూ నియమితులయ్యారు. ఆయన మరణంతో ముంబై క్రికెట్ అసోసియేషన్‌ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నాగ్‌పూర్ వేదికగా ముంబై- విదర్భ రంజీ సెమీ పైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్లంతా మిలింద్ మృతికి సంతాపం తెలిపారు. బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకుని, కాసేపు మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు.

Tags:    

Similar News