GOLD: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
వరల్డ్ బాక్సింగ్‌లో సంచలనం... భారత బాక్సర్ జైస్మీన్కు గోల్డ్
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ జైస్మీన్ లాంబోరియా చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియాపై నెగ్గి, గోల్డ్ మెడల్ ముద్దాడింది. అయితే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి గోల్డ్ మోడల్ కావడం విశేషం. జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్‌గా నిలిచి, విశ్వవేదికపై భారత జెండాను రెపరెపలాడించింది. కాగా, గతేడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మెడల్ సాధించకుండానే జైస్మీన్ పోటీల నుంచి నిష్క్రమించింది. తాజా విజయంతో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చినట్లైంది.
ఒలింపిక్ మెడల్ విన్నర్‌పై..
ఇంగ్లాండ్ వేదికగా లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా (పోలాండ్)ను ఢీ కొట్టింది. ఈ పోటీలో జూలియాను జైస్మీన్ 4-1 తేడాతో ఓడించి పసిడి పతకం ముద్దాడింది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగానే ఆడిన జైస్మీన్, ఆ తర్వాత పుంజుకుంది. ఊహించని రేంజ్లో పంచ్‌లతో ప్రత్యర్థికి అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా ఆధిపత్యం చలాయించింది. 'ఈ ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. 2024 పారిస్‌లో ఒలింపిక్స్‌లో నిష్క్రమణించిన తర్వాత, నేను శారీరకంగా, మానసికంగా నా టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నాను. ఒక సంవత్సరం పాటు నిరంతరం చేసిన కృషికి ఫలితం' అని జైస్మీన్ మ్యాచ్ అనంతంరం చెప్పింది. జైస్మీన్పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.