ఇంగ్లండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆటతీరుపై (35 బంతుల్లో 40)భారత మాజీ కీపర్ పార్థివ్ పటేల్ విమర్శలు గుప్పించారు. ‘హార్దిక్ తన ఆటతో ఇతర బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని పెంచారు. చాలా బంతులు డాట్స్ ఆడారు. కనీసం స్ట్రైక్ రొటేట్ చేసి ఉన్నా బాగుండేది. టీ20 మ్యాచ్‌లో క్రీజులో కుదురుకునేందుకు 20 బంతులు తీసుకోవడం దారుణం’ అని అన్నారు. కాగా.. సిరీస్‌లో తర్వాతి మ్యాచ్ ఈ నెల 31న జరగనుంది.
టీమ్ ఇండియా క్రికెటర్ వరుణ్ చక్రవర్తి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో రెండు ఓటముల్లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆయన ఈ ఫీట్ సాధించారు. 2024లో సౌతాఫ్రికాపై ఓడిన మ్యాచులోనూ 5 వికెట్ల ప్రదర్శన చేయగా వృథాగా మారింది. ఇండియా గత 31 మ్యాచుల్లో మూడింట్లో ఓటమి పాలైంది. అందులో ఈ రెండు మ్యాచులు ఉన్నాయి.
ఇక భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా చేతులెత్తేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసింది. హార్దిక్(40) కాసేపు ప్రయత్నించినా మరోవైపు నుంచి సహకారం కరువైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3, ఆర్చర్, కార్స్ తలో 2, రషీద్, వుడ్ చెరో వికెట్ తీశారు. 5 టీ20ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది.