HOCKEY: హాకీ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

విచారణకు ఆదేశించిన కేంద్రమంత్రి

Update: 2025-11-22 05:00 GMT

ఎఫ్‌­ఐ­హె­చ్ హాకీ జూ­ని­య­ర్ ప్ర­పం­చ­క­ప్ మరో పది రో­జు­ల్లో మొ­ద­ల­వ్వ­నుం­ది. ఈ మెగా టో­ర్నీ కోసం భారత బృం­దం చి­లీ­కి బయ­ల్దే­ర­నుం­ది. ఈ సమ­యం­లో సం­చ­లన ఆరో­ప­ణ­లు తీ­వ్ర కల­క­లం రే­పా­యి. జూ­ని­య­ర్ హాకీ జట్టు కో­చ్‌­పై ఒక క్రీ­డా­కా­రి­ణి­పై లైం­గిక వే­ధిం­పు­ల­కు పా­ల్ప­డ్డా­డ­ని తె­ల­సిం­ది. ఈ వి­ష­యం తె­లి­య­డం­తో కేం­ద్ర క్రీ­డా శాఖ వి­చా­ర­ణ­కు ఆదే­శిం­చిం­ది. అయి­తే.. ఈ సం­ఘ­టన జరి­గి చాలా రో­జు­లే అయిం­ద­ని.. ఎవరూ ఫి­ర్యా­దు చే­య­క­పో­వ­డం­తో ఆల­స్యం­గా క్రీ­డా మం­త్రి­త్వ శాఖ దృ­ష్టి­కి వచ్చి­న­ట్టు తె­లు­స్తోం­ది.

అసలేం జరిగిందంటే..

భారత మహి­ళల జూ­ని­య­ర్ హాకీ జట్టు ఈ ఏడా­ది పలు వి­దే­శీ టూ­ర్ల­కు వె­ళ్లిం­ది. జూ­న్‌­లో అర్జెం­టీ­నా, బె­ల్జి­యం, నె­ద­ర్లాం­డ్స్, సె­ప్టెం­బ­ర్‌­లో ఆస్ట్రే­లి­యా­లో మ్యా­చ్‌­లు ఆడిం­ది. అయి­తే.. ఈ సమ­యం­లో­నే ఒక ప్లే­య­ర్ కోచ్ గది­కి పలు­మా­ర్లు వె­ళ్లిం­ది. ఈ వి­ష­యం స్క్వా­డ్‌­లో­ని ఇతర అమ్మా­యి­ల­కు కూడా తె­లు­సు. కానీ, ఎవరూ కూడా ఈ వి­ష­యా­న్ని హాకీ ఇం­డి­యా లేదా కేం­ద్ర క్రీ­డా మం­త్రి దృ­ష్టి­కి తీ­సు­కు­రా­లే­దు. ఎలా­గో­లా ఈ వి­ష­యం చి­వ­ర­కు కేం­ద్ర మం­త్రి మన్సూ­ఖ్ మాం­డ­వీయ చె­విన పడిం­ది. దాం­తో.. అతడు వెం­ట­నే వి­చా­రణ చే­ప­ట్టా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. లైం­గిక వే­ధిం­పుల ని­వా­రణ చట్టం ప్ర­కా­రం బా­ధి­తు­రా­లు, కో­చ్‌, ఫి­ర్యా­దు­దా­రు పే­ర్ల­ను గో­ప్యం­గా ఉం­చ­ను­న్నా­రు. ఈ కే­సు­ను వి­చా­రిం­చిన తర్వా­తే ని­ర్ణ­యా­ని­కి రా­గ­ల­మ­ని దర్యా­ప్తు అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. హాకీ ఇం­డి­యా­ ఈ వి­ష­యం తె­లి­య­ద­ని అం­టు­న్నా­రు.

Tags:    

Similar News