క్రికెట్ లో ఐపిఎల్ లాగానే మొదలైన ప్రో కబడ్డీ లీగ్ దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ దక్కింకుంది. ఇప్పటికే 10 సీజన్స్ పూర్తి చేసుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఈ నెల 18 నుంచి 11వ సీజన్ లోకి అడుగుపెట్టింది. అదే రోజు తెలుగు టైటాన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బుల్స్ విజయం సాధించింది. ముఖ్యంగా తెలుగు టైటాన్స్ స్టార్ కమాండర్ పవన్ సెహ్రావత్ (ఇండియన్ నేషనల్ కబడ్డీ టీమ్ కెప్టెన్ ) హై - ఫ్లైయర్ యాక్షన్ క్రీడాభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది.
2014లో తెలుగు టైటాన్స్ ఫస్ట్ ఎడిషన్ కేవలం ఐదుగురు స్పాన్సర్లతోనే ప్రారంభమైంది. ఈ సీజన్ లో ఆ సంఖ్య 12 మందికి చేరింది. అంటే 11వ సీజన్ లో తెలుగు టైటాన్స్ కు 12మంది స్పాన్సర్లు చేరారన్నమాట.
ఈ సందర్భంగా తెలుగు టైటాన్స్ సీఈఓ త్రినాధ్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి యేడాది తెలుగు టైటాన్స్ టీమ్ భాగస్వామ్యంలో తమ ఇంట్రెస్ట్ ను చూపిస్తూ.. అగ్రశ్రేణి వ్యాపారులు, సంస్థల నుండి వచ్చిన స్పందనను చూసి మేము సంతోషిస్తున్నాము. దీనిని మేము గౌరవంగా భావిస్తున్నాము. మా స్పాన్సర్లు చాలా మంది మాకు ప్రతి సంవత్సరం మద్దతునిస్తూనే ఉన్నారు. ఈ సీజన్.. మేము ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో ఏర్పరచుకున్న నమ్మకం స్థాయికి సూచనగా ఉంది. రాబోయే సీజన్లో మేమంతా ఇంతే సమానంగా, ఉత్సాహంగా ఉంటాము. ఈసారి మరింత మెరుగ్గా, ధైర్యంగా ఉంటుందని విశ్వసిస్తున్నాము’’.. అన్నారు.
పార్క్ సన్ కార్టమండీ ఎమ్.డి, సిఇఓ కపిల్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “మేము ప్రో కబడ్డీ లీగ్ లో ఈ 11వ సీజన్ కోసం తెలుగు టైటాన్స్ తో చేతులు కలపడానికి సంతోషిస్తున్నాము. కబడ్డీలో మన సంస్కృతికి మూలాలున్నాయి. అందుకే పెరుగుతున్న జనాదరణ చూస్తుంటే ఎక్కడికి వెళ్లినా మళ్లీ అక్కడికే వచ్చే సైకిల్ తత్వానికి సరిగ్గా సరిపోతుంది. కబడ్డీ లాగానే, కార్డ్లు ఆడటం అనేది వ్యూహం, నైపుణ్యం, ఆలోచనలతో కూడిన గేమ్. ఇక్కడ ప్రతి కదలిక ఆటను మలుపు తిప్పుతుంది. మేము భారతదేశం అంతటా మా వ్యాపారాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ భాగస్వామ్యం స్వదేశీ క్రీడలకు మద్ధతునిచ్చే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. ’’ అన్నారు.
పది సీజన్ల విజయవంతమైన నేపథ్యంలో ‘ప్రో కబడ్డీ లీగ్’ పదకొండో సీజన్ 18 అక్టోబర్ 2024న ప్రారంభమై స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు డిస్నీ+ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.