ICC WORLD CUP: భారత్-పాక్ మ్యాచ్ తేదీ మార్పు
వన్డే ప్రపంచకప్‌లో తొమ్మిది మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేసిన ఐసీసీ.. భారత్ మ్యాచ్‌లు రెండు మార్పు...;
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ (ODI world cup 2023) మ్యాచ్ తేదీల్లో మార్పులు జరిగాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ (IND vs PAK) కూడా రీ షెడ్యూల్ అయింది. భద్రతా కారణాల రీత్యా అక్టోబరు 15న జరగాల్సిన దాయాదుల పోరును ఒకరోజు ముందు అక్టోబర్ 14నే నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. కానీ వేదికలో మాత్రం ఎలాంటి మార్పు లేదని, ముందుగా నిర్ణయించిన విధంగానే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది.
అక్టోబరు 15న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున నిఘా సంస్థలు మ్యాచ్ తేదీని మార్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి సూచించాయి. ఈ ప్రతిపాదనను BCCI... ICC దృష్టికి తీసుకెళ్లింది. BCCI సూచనతో భారత్-పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 14కు మార్చుతు నిర్ణయం తీసుకున్నారు. భారత్, పాక్ మ్యాచ్ సహా మొత్తం తొమ్మది మ్యాచ్‌లను కూడా ఐసీసీ రీ షెడ్యూల్ చేసింది. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ఆడే మరో మ్యాచ్ కూడా రీ షెడ్యూల్ అయింది. బెంగళూరు వేదికగా నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో జరగాల్సిన మ్యాచ్ నవంబర్ 12వ తేదీకి మారింది.
ఈ మెగా టోర్నీ అక్టోబర్ 5న మొదలై నవంబర్ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్.. రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
భారత్ మ్యాచ్‌లు
అక్టోబర్ 8: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11: ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 14: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2: ఇండియా వర్సెస్ శ్రీలంక (ముంబై)
నవంబర్ 5: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 12: ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (బెంగళూరు)
నాకౌట్ మ్యాచ్‌ల వివరాలు..
నవంబర్ 15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ 16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ 19: ఫైనల్ (అహ్మదాబాద్)